ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ కు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. స్కూల్ పిల్లలకు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలోని స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. డిసెంబర్ 24 నుంచి 26 వరకు ప్రభుత్వం క్రిస్మస్ హాలిడేస్ ప్రకటించింది .
డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే అలాగే జనరల్ హాలిడే కాబట్టి వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలోనూ మూడు రోజులు స్కూళ్లకు సెలవులు వర్తించనున్నాయి.
వరుసగా మూడు రోజులు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మూసివేయబడుతాయి. 2023 క్రిస్మస్ కు తెలంగాణ ప్రభుత్వం ఐదు రోజులు సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 22 నుంచి 27 వరకు సెలువు ఇచ్చింది
క్రిస్మస్ అనేది ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జరుపుకునే పండుగ. మతపరమైన ప్రాముఖ్యత కలిగిన క్రిస్మస్ చెట్లను అలంకరించడం, పాటలు పాడటం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి సంప్రదాయాలు పాటిస్తారు.