స్కూల్స్ ప్రారంభం : ప్లాస్టిక్ షీట్ల‌తో జాగ్ర‌త్త‌లు

స్కూల్స్ ప్రారంభం :  ప్లాస్టిక్ షీట్ల‌తో జాగ్ర‌త్త‌లు

థాయ్ లాండ్ లో స్కూల్స్ ప్రారంభమ‌య్యాయి. కానీ స్కూళ్ల నిర్వ‌హిస్తున్న తీరు మునుపెన్న‌డూ లేని విధంగా ఉన్నాయి.

పిల్ల‌ల‌కి ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉండేందుకు థాయ్ లాండ్ కు చెందిన స్కూళ్లు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు, అందుకు సంబంధించిన ఫోటోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

పిల్ల‌ల‌కు స‌ప‌రేట్ గా డెస్క్ లు, వారి చుట్టూ ప్లాస్టిక్ షీట్లు చుట్టేసిన దృశ్యాలు మ‌నకి క‌నిపిస్తున్నాయి. క్లాస్ రూముల్లో సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం, ఆట‌లాడే స‌మ‌యంలో జ‌ట్టుగా కాకుండా ఒంట‌రిగా ఆడుకునేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి అక్క‌డి పాఠ‌శాల‌లు.

అంతేకాదు ప్ర‌త్యేకంగా క‌రోనా టెస్ట్ లతో పాటు శానిటైజ‌ర్లు ఇత‌రాత్ర జాగ్ర‌త్త‌ల‌తో పాఠ‌శాల‌ల్ని నిర్వ‌హిస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా వాట్ ఖ్లాంగ్ తోయ్ స్కూల్ టీచ‌ర్ ముబుకా మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ వ‌ల్ల పాఠ‌శాల నిర్వ‌హ‌ణ క‌ష్ట‌మారింద‌న్నారు. ఓ వైపు విద్యాసంవ‌త్స‌రం వేస్ట్ అవ్వ‌కుండా స్కూల్స్ నిర్వ‌హిస్తున్నా..వైర‌స్ ఎలా సోకుంతుందోన‌న్న భ‌యం వెంటాడుతున్న‌ట్లు తెలిపారు.