తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీ ఓపెన్

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీ ఓపెన్

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు రీ ఓపెన్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.9 నుంచి ఆ పై తరగతులను ప్రారంభించాలని..ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో నిర్వహించిన  సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని..ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలన్నారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.

హఫీజ్ పేట్ భూములు..సవాలక్ష అనుమానాలు?

వ్యవసాయ చట్టాలను కొంత కాలం నిలిపివేస్తారా?