న్యూఢిల్లీ: దోమలను చాలా హానికరమైన కీటకాలుగా చెప్పొచ్చు. వైరస్‌లను మోసుకెళ్లే దోమల వల్ల ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జికా వైరస్, ఎల్లో ఫీవర్, లాంటి పలు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దోమల నివారణకు పరిష్కారాన్ని కనిపెట్టడానికి సైంటిస్టులు తీవ్రంగా యత్నిస్తున్నారు. అలాంటి సైంటిస్టుల్లో ఒకరైన ఎంటమాలజిస్ట్ పెర్రన్ రోజ్ చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.
Our study on inbreeding and laboratory adaptation in mosquitoes is out now! https://t.co/AnE8KU5aJR pic.twitter.com/ckUadL6ChD
— Perran Ross (@MosWhisperer) November 28, 2018
డెంగ్యూ, జికా లాంటి పలు వైరస్‌ల వ్యాప్తిని అడ్డుకోవడంపై పెర్రన్ రోజ్ పని చేస్తున్నారు. దోమలపై తన ప్రయోగానికి సంబంధించిన ఓ వీడియోను పెర్రన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో వేలాది దోమలు అతడి చేతిపై కుట్టడాన్ని చూడొచ్చు. రికార్డు స్థాయిలో 5 వేల ఆడ దోమలు తనను కుట్టాయని, తన శరీరం నుంచి 16 ఎంఎల్ రక్తం కోల్పోయానని మరో ట్వీట్‌లో పెర్రన్ తెలిపారు.
Record day of mosquito blood feeding today. ~5000 female mosquitoes fed and 16 mL of blood lost. pic.twitter.com/7OzeQ9rGl7
— Perran Ross (@MosWhisperer) May 7, 2020
