
చైనాలోని గబ్బిలాల్లో కొత్తగా 20 ప్రాణాంతకమైన వైరస్‌లను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోని గబ్బిలాలలో ఈ కొత్త వైరస్‌లను శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు ఒక కొత్త అధ్యయనం తెలిపింది. మొత్తం 22 రకాల వైరస్‌లను గుర్తించగా వీటిలో 20 వైరస్‌లు గతంలో ఎన్నడూ చూడనివి.
కొత్తగా కనుగొనబడిన వైరస్‌లలో రెండు హేనిపావైరస్‌లు (Henipaviruses) ఉన్నాయి.ఈ వైరస్‌లలో ప్రాణాంతక రెండు హెండ్రా ,నిపా వైరస్‌లకు జన్యుపరంగా దగ్గరి పోలికలున్నాయి. ఇవి గతంలో మానవులు, జంతువులలో తీవ్రమైన వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యాయి.
ఈ వైరస్ లంటే ఎందుకు అంత భయం?
ఈ కొత్త హేనిపావైరస్‌లు ఎక్కువగా గబ్బిలాల కిడ్నీలలో గుర్తించారు శాస్త్రవేత్తలు. కిడ్నీలు మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి గబ్బిలాలు మూత్ర విసర్జన చేసినప్పుడు అవి పండ్లు లేదా నీటిని కలుషితం చేసే అవకాశం ఉంది. ఈ కలుషితమైన వాటిని మనుషులు లేదా ఇతర జంతువులు తీసుకుంటే వారికి వైరస్ సోకే ప్రమాదం ఉంది.ఈ గబ్బిలాలు పండ్ల తోటలు, గ్రామాల సమీపంలో నివసించాయి. ఇది మనుషులు ,జంతువులకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో ఈ పరిశోధనలు జరిగాయి. పీర్-రివ్యూడ్ జర్నల్ PLOS పాథోజెన్స్‌లో ప్రచురించిన ఈ పరిశోధనలో 2017 నుంచి 2021 మధ్య 142 గబ్బిలాల నుంచి కిడ్నీల కణజాల నమూనాలను సేకరించి పరిశోధనలుచేశారు శాస్త్రవేత్తలు. వైరస్‌లు, బ్యాక్టీరియా ,కొత్త పరాన్నజీవిని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు జన్యు పరీక్షను ఉపయోగించారు.
కొత్తగా కనుగొనబడిన వైరస్‌లలో రెండు హేనిపావైరస్‌లు (Henipaviruses) ఉన్నాయి. ఇవి ఇప్పటికే మానవులలో ,జంతువులలో తీవ్రమైన వ్యాధులు, అధిక మరణాలకు కారణమైన హెండ్రా (Hendra) , నిపా (Nipah) వైరస్‌లకు జన్యుపరంగా చాలా దగ్గరగా ఉన్నాయి.
►ALSO READ | 200 కోట్ల మందికి అందని మంచి నీరు.. ఆ దేశాల్లో ఎక్కువగా సమస్య..
నిపుణుల హెచ్చరిక: ఈ వైరస్‌లు తీవ్రమైన జెనోటిక్ థ్రీట్స్ కలిగి ఉన్నాయని పరిశోధకులు హెచ్చరించారు. అంటే అవి జంతువుల నుంచి మానవులకు సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వీటిపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు.కొత్త వైరస్‌లు మానవులకు చేరే ముందు జంతువులలో వ్యాప్తి చెందడాన్ని అబ్జర్వ్ చేయడానికి ఇలాంటి మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు విశ్వసిస్తున్నారు.
ఈ అధ్యయనంలో ఒక కొత్త పరాన్నజీవి (Klossiella yunnanensis) , రెండు కొత్త బ్యాక్టీరియా జాతులను కూడా కనుగొన్నారు. ఈ పరిశోధన గబ్బిలాలలో వైరస్‌ల వైవిధ్యాన్ని ,మానవులకు సంక్రమించే ప్రమాదాలను మరోసారి స్పష్టం చేస్తుంది. భవిష్యత్ మహమ్మారులను నివారించేందుకు ఇటువంటి అధ్యయనాలు చాలా కీలకమైనవి.