దేశంలో కొత్త కరోనా మ్యూటెంట్.. యాంటీ బాడీస్‌కు దొరకదట

దేశంలో కొత్త కరోనా మ్యూటెంట్.. యాంటీ బాడీస్‌కు దొరకదట

కోల్‌కతా: దేశంలో మరో ప్రమాదకర కరోనా వైరస్ మ్యూటెంట్ ను సైంటిస్టులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లో శరవేగంగా విస్తరిస్తున్న బీ.1.618 రకం కరోనాను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యం అధికంగా ఉన్నట్లు సమాచారం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ నిపుణులు ఈ మ్యూటెంట్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. శరీరంలోని యాంటీబాడీస్‌, ప్లాస్మా ప్యానెల్స్ నుంచి తప్పించుకునే శక్తి దీనికుందని ఎక్స్ పర్ట్స్ స్పష్టం చేశారు. ప్రపంచంలో మరికొన్ని దేశాల్లోని ఈ తరహా డబుల్ మ్యుటేషన్లతో పోలిస్తే భారత్‌లో గుర్తించిన రకం అత్యంత ప్రమాదకారి అని నిపుణులు పేర్కొన్నారు. బెంగాల్‌లో బీ.1.617తోపాటు బీ.1.618 అనే మరో రకం మ్యూటెంట్ కూడా వేగంగా వ్యాప్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మ్యూటెంట్ లు రీ-ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్ ప్రభావాన్ని దాటి ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తాయా అన్న అంశంపై శాస్త్రవేత్తలు మరిన్ని అధ్యయనాలు చేస్తున్నారు.