జూలూరుపాడు, వెలుగు: ఎండ తీవ్రతతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఓ స్కూటీ దగ్ధమైంది. స్కూటీపై ఖమ్మం నుంచి పాల్వంచ వస్తుండగా మండలంలోని వినోబానగర్ గ్రామం సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ బ్రిడ్జి వద్ద స్కూటీలో మంటలు చెలరేగాయి.
స్కూటీపై ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే స్కూటీ దిగారు. మంటలు చెలరేగి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో హైవేపై కిలోమీటర్ మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
