28 ఏళ్ల తర్వాత మెగా టోర్నీలో తొలి విజయం

28 ఏళ్ల తర్వాత మెగా టోర్నీలో  తొలి విజయం


ఫాక్స్‌‌‌‌‌‌‌‌బరో: సుదీర్ఘ కాలం తర్వాత మెగా టోర్నీలో ఆడుతున్న స్కాట్లాండ్ 1–0తో హైతీపై నెగ్గింది. జాన్‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌గిన్‌‌‌‌‌‌‌‌ (28వ ని) స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌ తరఫున గోల్‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. 1998 తర్వాత స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఆడటం ఇదే తొలిసారి కాగా, 1990లో స్వీడన్‌‌‌‌‌‌‌‌పై గెలిచిన తర్వాత మెగా టోర్నీలో ఆ జట్టుకు ఇదే మొదటి విజయం కావడం విశేషం. 1974 తర్వాత తొలిసారి వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్న హైతీ సెకండాఫ్‌‌‌‌‌‌‌‌లో స్కోరును సమం చేసేందుకు గట్టిగానే ప్రయత్నించినా సక్సెస్​ కాలేదు.