టీ20 వరల్డ్ కప్‌లో 12 ఏండ్ల తర్వాత నేపాల్‌కు తొలి విజయం

టీ20 వరల్డ్ కప్‌లో 12 ఏండ్ల తర్వాత నేపాల్‌కు తొలి విజయం

ముంబై: టీ20 వరల్డ్ కప్‌‌‌‌ను నేపాల్ విజయంతో ముగించింది. తొలి మూడు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన ఆ జట్టు మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌–సి చివరి పోరులో 7 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌‌‌‌ను ఓడించింది. స్కాటిష్ టీమ్ 20 ఓవర్లలో 170/7 స్కోరు చేసింది. మైఖేల్ జోన్స్​ (75) సత్తా చాటగా.. సోంపాల్ 3  వికెట్లు తీశాడు. 

అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపేంద్ర సింగ్ (50 నాటౌట్‌‌‌‌), కుశాల్ (43) మెరుపులతో నేపాల్ 19.2 ఓవర్లలో 171/3 స్కోరు చేసి గెలిచింది. టీ20 వరల్డ్ కప్‌లో 12 ఏండ్ల తర్వాత నేపాల్‌కు దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం.