స్కాట్లాండ్ వరుసగా రెండో గెలుపు

స్కాట్లాండ్ వరుసగా రెండో గెలుపు

అంటిగ్వా : బ్రెండన్ మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ములెన్ (31 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), జార్జ్ మున్సే (20 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41) దంచికొట్టడంతో టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్కాట్లాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రాత్రి జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 వికెట్ల తేడాతో ఒమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. టాస్ నెగ్గిన ఒమన్ తొలుత 150/7 స్కోరు చేసింది. ఓపెనర్ ప్రతీక్ అతవాలె (54), అయాన్ ఖాన్ (41 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రాణించారు.

స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం స్కాట్లాండ్ 13.1 ఓవర్లలోనే 153/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ములెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవగా.. రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో గెలిచిన స్కాట్లాండ్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బిలో ఐదు పాయింట్లతో టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.