
సికింద్రాబాద్, వెలుగు: శబరిమలైకి వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లను నడపనుంది. కాచిగూడ– కొల్లం– -కాచిగూడ మధ్య ఈ నెల 18 నుంచి వచ్చే నెల 17 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి కొల్లంకు ఈ నెల18, 25, జనవరి1, 8, 15 తేదీల్లో రైళ్లు నడుస్తాయన్నారు. కొల్లం– కాచిగూడకు ఈ నెల 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఈ రైళ్లు ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, శ్రీరామ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కట్పాడి, జోలార్ పెట్టియా, సాలేమ్,ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాల్ఘాట్, త్రిషూర్, ఆళువా, ఎర్నాకులం, కొట్టాయం, చెన్‌గన్ సెరీ, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికర, కయన్ కులమ్ స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించారు. అయ్యప్ప స్వామి భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.