ఎస్సీ, ఎస్టీ పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్ల శంకర్

ఎస్సీ, ఎస్టీ పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్ల శంకర్

కాగజ్ నగర్, వెలుగు: పోడు భూములు సాగు చేస్తున్న ఎస్సీ, ఎస్టీలకు ఫారెస్ట్ ఆఫీసర్లు ఎటువంటి ఇబ్బందులకు గురిచేయొద్దని, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పోడు సాగు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్ల శంకర్ తెలిపారు. మంగళవారం ఆసిఫాబాద్​ జిల్లా చింతలమానేపల్లి మండలం కర్జెల్లిలోని పోడు భూముల వద్ద ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తవ్వుతున్నారన్న రైతుల ఫిర్యాదుతో కమిషన్ సభ్యులు రేణిగుంట ప్రవీణ్, నీలదేవి, రాంబాబు నాయక్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఎఫ్​డీవో అప్పయ్య, డీ ఎస్పీ వహీదుద్దీన్​తో కలిసి పర్యటించారు. పోడు భూములను పరిశీలించి దర్బార్ నిర్వహించారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖ అధికారులనుంచి వివరాలు తెలుసుకున్నారు. 

రైతులతో మాట్లాడగా రీట్రైవ్ పేరుతో ఫారెస్ట్ ఆఫీసర్లు ట్రెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తవ్వి పోడు భూముల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దిందా గ్రామంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ భూములు ఇప్పటికీ ఇవ్వలేదని మహిళలు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అనుమతులు ఇవ్వడం లేదని  బెజ్జూరు మండలం పాపన్నపేట రైతులు తమ సమస్యలను కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పోడు రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఫారెస్ట్, రెవెన్యూ అధికారులకు సూచించారు. ట్రెంచ్ పనులు నిలిపివేయాలని ఆదేశించారు.