మరోసారి భగ్గుమన్న బెంగాల్ రాజకీయాలు

మరోసారి భగ్గుమన్న బెంగాల్ రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రెండు పార్టీలకు చెందిన నాయకులు కొట్టుకున్నారు. టిఎంసి, బిజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...  ఇవాళ ఉదయం నేతాజీ జయంతి కార్యక్రమంలో భాగంగా నివాళులర్పించేందుకు బీజేపీ ఎమ్మెల్యే పవన్ సింగ్ వెళ్లారు. దీంతో ఆయనపై టీఎంసీ కార్యకర్తలు నేతలు దాడి చేశారని బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్ ఆరోపిస్తున్నాడు. ఎమ్మెల్యేపై ఇటుకలు విసిరారని.. కాల్పులు కూడా జరిపారని ఆయన పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన తనపై కూడా టీఎంసీ గూండాలు దాడి చేశారని అర్జున్ సింగ్ ఆరోపించారు.