జేన్ స్ట్రీట్ స్కామ్‌‌‌‌‌‌‌‌తో 4 షేర్లు కుదేల్‌‌‌‌‌‌‌‌ .. ఒక్క రోజే రూ.12 వేల కోట్లు లాస్‌‌‌‌‌‌‌‌

జేన్ స్ట్రీట్ స్కామ్‌‌‌‌‌‌‌‌తో 4 షేర్లు కుదేల్‌‌‌‌‌‌‌‌ .. ఒక్క రోజే రూ.12 వేల కోట్లు లాస్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: సెబీ జేన్ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌పై చేసిన దర్యాప్తు దలాల్ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ను కుదిపేసింది.  నాలుగు కంపెనీల మార్కెట్ వాల్యూ శుక్రవారం  రూ. 12 వేల కోట్లు తగ్గింది. జేన్ స్ట్రీట్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్, స్టాక్‌‌‌‌‌‌‌‌లను మానిప్యులేట్ చేసి  అక్రమంగా రూ.4,844 కోట్ల లాభాలను గడించిందని సెబీ ఆరోపించింది. దీంతో నువామా వెల్త్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ షేర్లు శుక్రవారం 11.26శాతం, బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ, ఏంజెల్ వన్ షేర్లు  6 శాతం చొప్పున, సీడీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ 2శాతం పడిపోయాయి.

  50శాతం ఆప్షన్స్ వాల్యూమ్‌‌‌‌‌‌‌‌ను  ప్రొప్రైటరీ ట్రేడింగ్ సంస్థలు నడిపిస్తున్నాయని,   వీరు వెనక్కి తగ్గితే  రిటైల్ ట్రేడింగ్ (35శాతం) దెబ్బతింటుందని జేరోధా ఫౌండర్  నితిన్ కామత్ అన్నారు.  ఇలాంటి నిషేధాలతో ట్రేడింగ్ వాల్యూమ్ పడిపోతుందని పేర్కొన్నారు.