మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక నిర్ణయం

మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక నిర్ణయం

తెలంగాణలో విధించిన నైట్ కర్ప్యూ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడింది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. కర్ప్యూ దృష్ట్యా ప్రచార సమయాన్ని కుదిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే చేయాలని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకే బహిరంగ సభలు, లౌడ్ స్పీకర్ల వినియోగం చేయాలని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రచారంలో అన్ని పార్టీలు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎస్ఈసీ సూచించింది. ఈ నెల 30న పలు కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.