నా ఆఫీస్​లోకి ఎలా వచ్చాయో అర్థం కావట్లే: బైడెన్​

నా ఆఫీస్​లోకి ఎలా వచ్చాయో అర్థం కావట్లే: బైడెన్​

వాషింగ్టన్: తన ప్రైవేట్ ఆఫీస్​లో రహస్య డాక్యుమెంట్లు ఉన్నట్టు తనకు తెలీదని, అవి దొరికాయనే విషయం తెలిసి ఆశ్చర్యపోయానని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్​ అన్నారు. క్లాసిఫైడ్​ డాక్యుమెంట్స్​లో ఏముందో కూడా తెలీదని స్పష్టం చేశారు. మెక్సికోలో జరుగుతున్న 10వ నార్త్​ అమెరికన్​ లీడర్స్​ సమిట్​లో పాల్గొన్న ఆయన, ఆ దేశ ప్రెసిడెంట్ లోపెజ్ ఒబ్రాడోర్, కెనడా ప్రధాని​జస్టిన్ ట్రూడోతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఆర్కైవ్స్ విభాగంతో పాటు డిపార్ట్​మెంట్ ఆఫ్ జస్టిస్​కు దర్యాప్తులో సహకరిస్తానని చెప్పారు. ‘‘క్లాసిఫైడ్​ డాక్యుమెంట్లు నా ప్రైవేట్ ఆఫీసులోకి ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. ‘‘ది పెన్న్​ బైడెన్ సెంటర్’’లో నా లాయర్లు అక్కడ ప్రైవేట్ ఆఫీస్  ఏర్పాటు చేశారు. 2017 నుంచి 2020 ప్రెసిడెంట్ ఎలక్షన్స్​ క్యాంపెయిన్​ ప్రారంభమయ్యే దాకా అక్కడే ఉన్నాను. ప్రెసిడెంట్ అయ్యాక, నా అటార్నీలు కిందటేడాది నవంబర్ 2న ఈ ఆఫీస్​ను ఖాళీ చేసేందుకు వెళ్లారు. అప్పుడు ఓ ర్యాక్​లో ఈ ఫోల్డర్ గుర్తించారు” అని బైడెన్ చెప్పారు.