దేశంలో రెండో ఒమిక్రాన్ BA.4 కేసు.. ఎక్కడంటే

దేశంలో రెండో ఒమిక్రాన్ BA.4 కేసు.. ఎక్కడంటే

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.4 మరో రాష్ట్రంలో ప్రవేశించింది. దేశంలో మొదటి కేసు హైదరాబాద్‌‌లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా.. తమిళనాడు రాష్ట్రంలో ఈ వైరస్ వెలుగు చూసింది. ఈ విషయాన్ని వైద్య శాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం ప్రకటించారు. తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లా నవులూరుకు చెందిన వ్యక్తిలో ఈ వైరస్ గుర్తించినట్లు తెలిపారు. అయితే.. BA.4 రకంలో కొత్త లక్షణాలు ఏవీ కనిపించడం లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇండియా SARS Cov2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) మే 23వ తేదీ సోమవారం ఓ బులెటిన్ ను విడుదల చేయనుంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ4 తొలి కేసు హైదరాబాద్ లో నమోదైందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 10 రోజుల క్రితం దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఓ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చినట్లు, అతనికి కరోనా పాజిటివ్గా తేలడంతో శాంపిల్స్ను ఇన్సాకాగ్కు పంపడం జరిగిందని వెల్లడించింది.

పరీక్ష అనంతరం సదరు వ్యక్తిలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బిఎ 4 రకం వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు, వెంటనే అలర్ట్ అయిన హెల్త్ డిపార్టమెంట్.. అతనితో పాటు సమావేశంలో పాల్గొన్న 24 మందికి టెస్ట్ లు నిర్వహించగా.. వారందరికీ నెగటివ్ గా తేలిందని తెలిపింది. ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన వ్యక్తిని కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి మరోసారి టెస్ట్ నిర్వహించనున్నట్లు వైద్య శాఖ ప్రకటించింది. ఈ వేరియంట్  ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని.. అయినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. BA.4 రకాన్ని జనవరి 10వ తేదీన సౌతాఫ్రికాలో మొదటిసారి కనుగొన్న సంగతి తెలిసిందే. అనంతరం మెల్లిమెల్లిగా ఇతర దేశాల్లోకి పాకింది.

మరిన్ని వార్తల కోసం :-

కాంగ్రెస్ రచ్చబండను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు 

 

పోలీసులు బాడీ వార్న్ కెమెరాలు ధరించాలి