
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మోగిలిపాలెంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.దీంతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపుచేశారు. ఈ క్రమంలో పలువురు టీఆర్ఎస్,కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మోగిలిపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు.
మరిన్ని వార్తల కోసం
కర్ణాటకలో ఎడతెరిపిలేని వర్షాలు
రైల్వే ట్రాక్ లే వారి నివాసాలు