రైల్వే ట్రాక్ లే వారి నివాసాలు 

రైల్వే ట్రాక్ లే వారి నివాసాలు 

చుట్టూ వరద నీరు. తినడానికి తిండి లేదు. ఉండటానిక గూడు లేదు. ఎటు వెళ్లాలన్నా కనుచూపు మేర వరదనీరే. ఏం చెయ్యాలో..ఎటు వెళ్లాలో తెలియదు. అలాంటి విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడటం పెద్ద సాహసమే అవుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సొంత ఊరును వదిలిపెట్టి వెళ్లడం ఇష్టం లేని ఆ రెండు గ్రామాల ప్రజలు రైల్వే ట్రాక్ లపై జీవిస్తున్నారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..దాదాపు 500 కుటుంబాలు బిక్కు బిక్కుమంటూ  రైల్వే ట్రాక్ లపై ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. 

అసోంలో వానలు, వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మందిపై  తీవ్ర ప్రభావం చూపించింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులైన జమునముఖ్ జిల్లాలోని చాంగ్‌జురాయ్, పాటియా పత్తర్ గ్రామాలు  పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దీంతో దాదాపు 500 కుటుంబాలు గత ఐదు రోజులగా రైలు ట్రాక్ ల పై టార్పాలిన్ షీట్లతో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా వర్షాలు, వరదలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా..ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని వాపోతున్నారు. ఇక్కడ పరిస్థితి చాలా సవాలుగా ఉందని.. కనీసం తాగడానికి కూడా మంచినీరు దొరకడం లేదని చెబుతున్నారు. తామందరూ రోజుకు ఒక్క పూట మాత్రమే తింటున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తల కోసం

పాడి రైతులను ఆదుకోవాలె

తెలంగాణలో కాంగ్రెస్​ పుంజుకుంటుందా?