కర్ణాటకలో ఎడతెరిపిలేని వర్షాలు

కర్ణాటకలో ఎడతెరిపిలేని వర్షాలు

కర్ణాటక వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా 4 రోజుల పాటు కురుస్తున్న వానలకు బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలతో ఇప్పటి వరకు 9మంది చనిపోయారు. ఉత్తర కన్నడ ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్ల వెంట నీళ్లు ప్రవహిస్తున్నాయి. చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు CM బసవరాజ్ బొమ్మై. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు బొమ్మై. ఈ ప్రత్యేక బృందాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంజినీర్లు ఉంటారని చెప్పారు. వరద ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. కృష్ణరాజసాగర్, కబిని, హరంగి, హేమావతి, ఆల్మట్టి, నారాయణపు, భద్ర, తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ ఆనకట్టలు పొంగిపొర్లుతున్నాయి.