కింగ్‌స్టన్: వెస్టిండీస్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. గురువారం జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 1-–0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఆ విజయంతో శ్రీలంక కొత్త కోచ్, దక్షిణాఫ్రికా మాజీ స్టార్ గ్యారీ కిర్‌స్టన్‌కు కోచ్‌గా తొలి విజయం దక్కింది. అంతేకాకుండా కరేబియన్ గడ్డపై శ్రీలంకకు 13 ఏళ్ల తర్వాత లభించిన మొదటి వన్డే విజయం ఇది. సబీనా పార్క్ మైదానంలో శనివారం జరగాల్సిన ఈ డే-నైట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోవడంతో.. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
