రెండో విడత లో16 జీపీలు ఏకగ్రీవం.. వికారాబాద్ జిల్లా ఎన్నికల వివరాలు ఇవే..!

రెండో విడత లో16 జీపీలు ఏకగ్రీవం.. వికారాబాద్ జిల్లా ఎన్నికల వివరాలు ఇవే..!

వికారాబాద్, వెలుగు: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 16 గ్రామాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. కోట్​పల్లి మండలంలోని బార్వాద్​ తండా, బుగ్గాపూర్​, కంకణాలపల్లి, లింగంపల్లి, రాంపూర్, మోమిన్​పేట మండలంలో అమ్రాదికుర్దు, చిన్న కోలుకుంద, చీమల్​దరి, మక్తా తండా, ధరూర్​ మండలంలో అవుసుపల్లి, నాగ్​సాన్​పల్లి, పీసీఎం తండా, మర్పల్లి మండలంలో మొగిలిగుండ్ల, నర్సాపూర్​ పెద్ద తండా, నవాబుపేట మండలంలో మైతాబ్​ఖాన్​గూడ, నాగిరెడ్డిపల్లి సర్పంచ్​స్థానాలు ఏకగ్రీయ్యాయని పేర్కొన్నారు. వికారాబాద్ మండలంలోని అత్వెల్లిలో వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా.. సర్పంచ్​ స్థానానికి ఎన్నికలు జరుగుతాయన్నారు. మొదటి విడతలో 37 సర్పంచ్​స్థానాలు కలుపుకొని మొత్తం 53 జీపీలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు.

348 పీవోలకు షోకాజ్ నోటీస్

రంగారెడ్డి కలెక్టరేట్ : జిల్లాలోని కొత్తూర్,  నందిగామ, కేశంపేట్, కొందుర్గ్, జిల్లెడ్ చౌదర్ గూడ, ఫరూక్ నగర్, శంషాబాద్  మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం మొత్తం 1,989 మంది అధికారులను పీవోలుగా నియమించి, వారికి రెండోసారి ఈ నెల 6న ట్రైనింగ్ ఇచ్చారు. ఈ శిక్షణకు హాజరు కాని 348 పీవోలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​నారాయణరెడ్డి షోకాజ్ నోటీస్ జారీ చేశారు.