- ఉమ్మడి జిల్లాలోని 418 గ్రామాల్లో బరిలో 1726 మంది అభ్యర్థులు
- మొదటి విడత ఎలక్షన్ల నిర్వహణకు ఏర్పాట్లు
జగిత్యాల జిల్లాలో రెండో విడతలో బీర్పూర్, జగిత్యాల మండలం, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో 144 సర్పంచ్ స్థానాలు ఉండగా.. వీటిలో 10 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 134 గ్రామాల్లో 521 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ గ్రామాల పరిధిలో 1,256 వార్డు స్థానాలకు గానూ 330 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 925 వార్డుల్లో 2,624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నెట్వర్క్. వెలుగు: రెండో దశ ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో అభ్యర్థుల విత్ డ్రా శనివారం ముగిసింది. ఫైనల్గా బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను అధికారులు ఆదివారం ప్రకటించారు. ఉమ్మడిజిల్లాలో ఎన్నికలు జరిగే 418 గ్రామాల్లో మొత్తం 1,726 మంది అభ్య ర్థులు బరిలో నిలిచారు. వీరిలో జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో 21 మంది సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి.
కరీంనగర్ జిల్లాలో ఎన్నికలు జరిగే 113 గ్రామాల్లో మొత్తం 888 నామినేషన్లు రాగా.. వీటిలో స్క్రూట్నీ అనంతరం 566 మంది నామినేషన్లకు ఆర్వోలు ఆమోదం తెలిపారు. 322 నామినేషన్లను రిజెక్ట్ కాగా నామినేషన్ వేసినవారిలో 128 మంది. ఉపసంహరించుకున్నారు.
ఫైనల్గా 438 మంది బరిలో నిలిచారు. అలాగే 1,046 వార్డు స్థానాల్లో 3.056 నామినేషన్లు రాగా 2,682 మంది నామినే షన్లకు ఆమోదం తెలిపి 374 నామినేషన్లను రిజెక్ట్ చేశారు. 209 మంది నామినేషన్ ఉపసంహరిం చుకోగా 2,473 మంది వార్డు స్థానాల్లో పోటీలో ఉన్నారు.
పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం, ధర్మారం, జూలపల్లి, పాలకుర్తి మండలం లో రెండో విడతలో ఎన్నికలు ఉన్నాయి. ఆయా మండలాల పరిధిలోని 73 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటిల్లో 488 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీపడుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలం లో రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు మండలాల పరిధిలో 88 గ్రామాలు ఎన్నికలు జరగనున్నా యి. వీటిల్లో 11 సర్పంచులు ఏకగ్రీవమయ్యా యి. మిగిలిన పంచాయతీలకు 279 మంది ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 758 వార్డు సభ్యుల స్థానాలకు గానూ 182 వార్డులు ఏకగ్రీ వం కాగా 1,342 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
