
నాగశౌర్య హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రాగా బుధవారం మరో పాటను విడుదల చేశారు. ‘అమెరికా నుండి వచ్చాను’ అంటూ సాగే ఈ పాటను హ్యారిస్ జయరాజ్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ రాసిన లిరిక్స్ మాస్‌ను ఆకట్టుకునేలా సాగాయి.
చందన బాల కళ్యాణ్, గోల్డ్ దేవరాజ్ ఎనర్జిటిక్‌గా పాడారు. ఈ స్పెషల్ సాంగ్‌లో స్నేహా గుప్తా డ్యాన్స్ చేసింది. విధి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, వీకే నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.