బక్కగున్నా సక్కగున్నావ్ పిల్లా

బక్కగున్నా సక్కగున్నావ్ పిల్లా

వెన్నెల కిషోర్, రవితేజ మహాధ్యాసం,  అనన్య నాగళ్ల, శియా గౌతమ్ ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న  క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. వెన్నపూస రమణ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, శనివారం రెండో పాటను విడుదల చేశారు.  సునీల్ కశ్యప్ కంపోజ్ చేసిన పాటకు పూర్ణాచారి ఆకట్టుకునే లిరిక్స్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్‌‌‌‌గా పాడాడు.

‘ప్రేమించానే పిల్ల.. నిన్ను ప్రేమించానే పిల్ల.. లవ్ అంటారా పిల్ల.. కాదు లైఫ్ అంటారే పిల్ల.. నువ్వు చూస్తే బక్కగున్నావ్.. నాకు మాత్రం సక్కగున్నావ్.. నా గుండె నీ గుడిగా మార్చేశానే..’ అంటూ సాగిన మెలోడీ సాంగ్‌‌‌‌లో అనన్య నాగళ్ల, రవితేజ మహాధ్యాసం రెట్రో లుక్స్‌‌‌‌లో ఆకట్టుకున్నారు.  భద్రం, అనీష్ కురివెళ్ల, నాగ మహేష్, మచ్చ రవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  రూరల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతోన్న ఈ సినిమా ఫన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు  చెప్పారు.