ఆ ఒక్కటీ అడక్కు మూవీ నుండి సెకండ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

ఆ ఒక్కటీ అడక్కు మూవీ నుండి సెకండ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన  చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం సెకండ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘హమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకి.. కన్నులకే చెప్పేస్తుంది ప్రతి సంగతి..’ అంటూ సాగిన మెలోడీ సాంగ్‌‌‌‌‌‌‌‌లో నరేష్, ఫరియా కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. స్టైలిష్ మేకోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేస్తున్నారు.

గోపీ సుందర్ కంపోజ్ చేసిన పాటకు  భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ రాశారు. యశస్వి కొండేపూడి పాడిన తీరు ఆకట్టుకుంది. ఇదొక కంప్లీట్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్‌‌‌‌‌‌‌‌ అవుట్ అండ్ అవుట్ ఫన్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నాడు. వెన్నెల కిశోర్, అరియానా గ్లోరి,  జామీ లివర్, వైవా హర్ష ఇతర పాత్రలు పోషించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.