కేశవ చంద్ర రమావత్ చిత్రం నుంచి రెండో పాట విడుదల

కేశవ చంద్ర రమావత్ చిత్రం నుంచి రెండో పాట విడుదల

రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్‌‌‌‌). ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని రెండో పాటను శుక్రవారం విడుదల చేశారు. నందినగర్‌‌‌‌లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో ఈ పాటను ఆవిష్కరించారు. ‘తెలంగాణ తేజం’ అంటూ సాగే ఈ పాటను గోరటి వెంకన్న రాశారు.  మను కల్పనతో కలిసి ఆయనే పాడారు. రాకేష్‌‌తో పాటు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, యాంకర్ సుజాత, సింగర్ విహ, లిరిక్ రైటర్ సంజయ్ మహేష్ తదితరులు కేసీఆర్‌‌‌‌ను కలిశారు.