ఫ్రేజర్‌‌‌‌ ఫటాఫట్‌‌‌‌..ఐపీఎల్‌‌‌‌లో ఢిల్లీకి రెండో విజయం

ఫ్రేజర్‌‌‌‌ ఫటాఫట్‌‌‌‌..ఐపీఎల్‌‌‌‌లో ఢిల్లీకి రెండో విజయం
  •     6 వికెట్ల తేడాతో ఓడిన లక్నో
  •     రాణించిన కుల్దీప్, పంత్‌‌‌‌

లక్నో : ఐపీఎల్‌‌‌‌–17లో  రెండు వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌  గాడిలో పడింది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న లక్నో సూపర్ జెయింట్స్‌‌కు బ్రేక్ వేసింది. చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో అరంగేట్రం ఆటగాడు జేక్ ఫ్రేజర్‌‌‌‌ మెక్‌‌‌‌గర్క్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 55) ఫిఫ్టీకి తోడు కెప్టెన్ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (24 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 41), పృథ్వీ షా (22 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లతో 32) నిలకడగా ఆడటంతో..

శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో డీసీ 6 వికెట్ల తేడాతో లక్నోపై నెగ్గింది. తొలుత లక్నో 20 ఓవర్లలో 167/7 స్కోరు చేసింది. ఆయూష్‌‌‌‌ బదోనీ (35 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 55*), కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (22 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 39), అర్షద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (20) రాణించారు. కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (3/20)  మూడు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌‌లో ఢిల్లీ 18.1 ఓవర్లలో 170/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. . కుల్దీప్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.

ఆదుకున్న ఆయూష్, అర్షద్

టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌ ఎంచుకున్న లక్నో వరుసగా వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితం అయింది. తొలి వికెట్‌‌‌‌కు 28 రన్స్‌‌‌‌ జోడించి డికాక్‌‌‌‌ (19) ఔటైనా, రాహుల్‌‌‌‌ స్థిరంగా ఆడాడు. కానీ రెండో ఎండ్‌‌‌‌లో సరైన సహకారం లభించలేదు. దేవదత్‌‌‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌ (3) మళ్లీ ఫెయిలవ్వగా, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ 8వ ఓవర్‌‌‌‌లో డబుల్‌‌‌‌ ఝలక్‌‌‌‌ ఇచ్చాడు. వరుస బాల్స్‌‌‌‌లో స్టోయినిస్‌‌‌‌ (8), పూరన్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేశాడు. తన తర్వాతి ఓవర్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌కు పంపడంతో లక్నో 77 రన్స్‌‌‌‌కే సగం జట్టును కోల్పోయింది. ఈ దశలో ఆయూష్‌‌‌‌ అద్భుతంగా ఆడాడు.

ఎక్కువ స్ట్రయికింగ్‌‌‌‌ తీసుకుని వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టాడు. కానీ ఏడు బాల్స్‌‌‌‌ తేడాలో దీపక్‌‌‌‌ హుడా (10), క్రునాల్‌‌‌‌ పాండ్యా (3) వెనుదిరగడంతో లక్నో 94/7తో మళ్లీ కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌‌‌లో వచ్చిన అర్షద్‌‌‌‌.. ఆయూష్‌‌‌‌కు మంచి సహకారం అందించాడు. 31 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన ఆయూష్‌‌‌‌తో కలిసి ఎనిమిదో వికెట్‌‌‌‌కు 42 బాల్స్‌‌‌‌లోనే 73 రన్స్‌‌‌‌ జోడించాడు. తొలి పది ఓవర్లలో  80/5 స్కోరు చేసిన లక్నో ఆఖరి 10 ఓవర్లలో 87 రన్స్‌‌‌‌ జోడించింది. ఖలీల్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ 2, ఇషాంత్‌‌‌‌, ముకేశ్‌‌‌‌ చెరో వికెట్‌‌‌‌ తీశారు.

ఫ్రేజర్‌‌‌‌ జోరు..

చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో డీసీకి సరైన ఆరంభం దక్కలేదు. 4వ ఓవర్‌‌‌‌లోనే డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌ (8) వికెట్‌‌‌‌ కోల్పోయింది. కానీ ఓ ఎండ్‌‌‌‌లో పృథ్వీ షా నిలకడగా ఆడాడు. అతనికి జేక్‌‌‌‌ ఫ్రేజర్‌‌‌‌ అండగా నిలిచాడు. దీంతో పవర్‌‌‌‌పేల్లో 62/1 స్కోరు చేసిన ఢిల్లీ ఏడో ఓవర్‌‌‌‌లో పృథ్వీ వికెట్‌‌‌‌ను చేజార్చుకుంది. రెండో వికెట్‌‌‌‌కు 39 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. 63/2తో ఎదురీత మొదలుపెట్టిన డీసీ ఇన్నింగ్స్‌‌‌‌ను  ఫ్రేజర్‌‌‌‌ ఆదుకున్నాడు. బౌలర్ల ఫామ్‌‌‌‌తో సంబంధం లేకుండా ఫోర్లతో పాటు లాంగాన్‌‌‌‌, మిడాఫ్‌‌‌‌లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అవతలివైపు పంత్‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించాడు.

ఈ ఇద్దరి జోరుతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో 75/2 స్కోరు చేసిన డీసీ 12 ఓవర్లలో 100కి చేరింది. 31 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన ఫ్రేజర్‌‌‌‌ను 15వ ఓవర్‌‌‌‌లో నవీన్‌‌‌‌ ఉల్‌‌‌‌ హక్‌‌‌‌ (1/24) బోల్తా కొట్టించాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో పంత్‌‌‌‌ కూడా వెనుదిరగడంతో డీసీ 146/4తో నిలిచింది. ఈ ఇద్దరు మూడో వికెట్‌‌‌‌కు 77 (46 బాల్స్‌‌‌‌) రన్స్‌‌‌‌ జత చేసి గెలుపు దిశగా తీసుకెళ్లారు. ఇక 27 బాల్స్‌‌‌‌లో 22 రన్స్‌‌‌‌ అవసరం కాగా, ట్రిస్టాన్‌‌‌‌ స్టబ్స్‌‌‌‌ (15*), షై హోప్‌‌‌‌ (11*) మరో 11 బాల్స్‌‌‌‌ మిగిలి ఉండగానే టీమ్‌‌ను గెలిపించారు.రవి బిష్ణోయ్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. 

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 167/7 (ఆయూష్‌‌‌‌ 55*, రాహుల్‌‌‌‌ 39, కుల్దీప్‌‌‌‌ 3/20).

ఢిల్లీ : 18.1 ఓవర్లలో 170/4 (ఫ్రేజర్‌‌‌‌ 55, పంత్‌‌‌‌ 41, పృథ్వీ 32, బిష్ణోయ్ 2/25).