
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సెక్రటేరియట్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయిస్ (వెల్ఫేర్) అసోసియేషన్ కు నూతన కార్యవర్గం మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సమావేశమై అధ్యక్షుడిగా జి. ప్రశాంత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రాము భూక్యా, గౌరవ అధ్యక్షుడిగా వి.సైదాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సలహాదారులుగా కే. సునీత, ఎం. సుజాత, యాదయ్య, ఉపాధ్యక్షులుగా డి. లలిత కుమారి, ఎస్.కిషోర్ కుమార్, ఎం.రమేష్ కుమార్, టి.స్వరన్ రాజ్, సంయుక్త కార్యదర్శులుగా డి.ధన రాజు, వి. శిల్పా, టి. సరితా, కోశాధికారిగా బి. సోమన్న, నిర్వహణ కార్యదర్శులుగా కే. మంజు, టి. ఆంజనేయులు, ప్రచార కార్యదర్శిగా సుజాత, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా ఎం. రాధా కృష్ణ, ఎం. సూరజ్ బిన్నీ, ఏ. తిరుపతయ్య , పి.నర్సింగ్ రావు, చంద్రకళ, నీరజాక్షి, జె. శ్రీనివాస రావు, డి.సుశీల, కే. రామస్వామి ఎన్నికయ్యారు.