మోడీ డాక్యుమెంటరీ వివాదం.. ఢిల్లీ యూనివర్సిటీలో 144 సెక్షన్

మోడీ డాక్యుమెంటరీ వివాదం.. ఢిల్లీ యూనివర్సిటీలో 144  సెక్షన్

ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఎన్‌ఎస్‌యు, ఐ-కెఎస్‌యు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ వద్ద ఢిల్లీ పోలీసులు శుక్రవారం 144 సెక్షన్  విధించారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ వెలుపల కూడా భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశం కావడం నిషేధించారు. ఎన్‌ఎస్‌యుఐ, భీమ్ ఆర్మీ స్టూడెంట్ ఫెడరేషన్ రెండు  గ్రూపులు శుక్రవారం  సాయంత్రం డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారని పోలీసులకు సమాచారం అదండంతో ముందస్తులో భాగంగా పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఢిల్లీ,  కేరళకు చెందిన విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. క్యాంపస్ లోపల డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఎలాంటి అనుమతి లేదని ప్రొక్టర్ రజనీ అబ్బి  చెబుతున్నారు. యూనివర్సిటీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సెక్షన్ 144 విధించినట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ సింగ్ కల్సి వెల్లడించారు.