మోడీని దించాలంటే ప్రజా పోరాటాలు బలపడాలి

మోడీని దించాలంటే ప్రజా పోరాటాలు బలపడాలి
  • సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి

సూర్యాపేట జిల్లా: కేంద్రంలో ఉన్న బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం నుండి దేశాన్ని కాపాడుకోవాలంటే లౌకిక శక్తులు ఏకంకావడమే ఏకైక మార్గమని అన్నారు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సంస్మరణ సభకి ఏచూరి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ప్రగతి భవన్ లో భోజనానికి పిలిచి ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించి బీజేపీ ని గద్దె దించాలన్న కేసీఆర్ ఇప్పుడు దేశాభివృద్ధి కి కావలసింది ఫ్రంట్ లు కాదు ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని మాటమార్చారని విమర్శించారు . 
బీజేపీ కార్పొరేట్ల కొమ్ముకాస్తూ పెదప్రజల పొట్ట కొడులతోందని అన్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచి మోడీ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనం లూటీ చేసి ఇప్పుడు రాష్ట్రాలను పన్నులు తగ్గించుకోవాలని అనడం సిగ్గుచేటని ఆగ్రహాo వ్యక్తం చేశారు . రైతు పోరాటాలతో నల్ల రైతు చట్టాలు వెనక్కి పోయినట్లు ప్రజావ్యతిరేక బీజేపీని గద్దె దించాలంటే ప్రజా పోరాటాలు , వర్గ పోరాటాలు బలపడాలని ఆకాంక్షించారు సీతారాం ఏచూరి.

 

ఇవి కూడా చదవండి

దేశంలో తలసేమియాలేని తొలి రాష్ట్రంగా నిలుపుతాం

అంబులెన్స్ లేక... మృతదేహాన్ని మోసుకెళ్లిన వృద్ధుడు

సిజేరియన్ డెలివరీలకు ముహూర్తాలు పెట్టొద్దు