సిజేరియన్ డెలివరీలకు ముహూర్తాలు పెట్టొద్దు

సిజేరియన్ డెలివరీలకు ముహూర్తాలు పెట్టొద్దు
  • పూజారులు, డాక్టర్లకు అధికారుల హెచ్చరిక

కరీంనగర్: ముహుర్తాల పేరుతో సిజేరియన్ ఆపరేషన్లు పెరిగిపోతుండంటంపై కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. జిల్లాలోని డాక్టర్లు, పూజారులతో సమావేశం నిర్వహించారు కలెక్టర్ ఆర్వీ కర్ణన్. పిల్లలు పుట్టేందుకు ముహుర్తాలను చెప్పొద్దని పూజారులను కోరారు. ఎమెర్జెన్సీ అయితేనే ఆపరేషన్లు చేయాలని...సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలకు ప్రయత్నించాలని డాక్టర్లకు సూచించారు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నిన్న కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన సందర్భంగా  రాష్ట్రంలో కొందరు డాక్టర్లు అవసరం లేకున్నా.. సిజేరియన్లు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనవసరంగా ఆపరేషన్లు చేయడం వల్ల  పుట్టిన బిడ్డకు, తల్లికి మంచిది కాదన్నారు. అధికారులు, డాక్టర్లు, ఆశావర్కర్లు,  సహజ కాన్పులు ( నార్మల్ డెలివరీలు) జరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

మంత్రి సూచనపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులపై ఆరా తీశారు. కొందరు పూజారులు ముహూర్తాలు కూడా నిర్ణయిస్తున్నారన్న విషయం తెలిసి వారిని కూడా పిలిచి వైద్యాధికారులతో కలసి ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. సిజేరియన్ డెలివరీలు అత్యవసరమైతే తప్ప చేయకూడదని.. మీరు ముహూర్తాలు నిర్ణయించవద్దని డాక్టర్లు, పూజారులకు స్పష్టం చేశారు. 

 


రాష్ట్రంలోని డెలివరీల్లో 90 శాతం కరీంనగర్ జిల్లాలోనే
కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న సిజేరియన్ డెలివరీలు ఆందోళన కలిగిస్తున్నాయి.  రాష్ట్రంలో జరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లలో 90 శాతం కరీంనగర్ జిల్లాలోనే జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జాతకాలపై నమ్మకంతో కొంత మంది సిజేరియన్ డెలివరీలకు ముహూర్తాలు పెట్టుకుని చేయించుకుంటుండగా.. కొంత మంది డాక్టర్లు డబ్బుల కోసం సిజేరియన్ డెలివరీలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై వీ6 న్యూస్ ప్రత్యేక కథనం..

 

ఇవి కూడా చదవండి

హీరోయిన్ జాక్వెలిన్‌ ఆస్తులు సీజ్‌ చేసిన ఈడీ

చెన్నూరులో బీజేపీ నాయకులపై దాడి

సొంత పార్టీ మేయర్ పై తిరగబడ్డ టీఆర్ఎస్ కార్పొరేటర్

చిన్నదొరకు తెలంగాణలో దోస్తులు లేరా?