దేశంలో తలసేమియాలేని తొలి రాష్ట్రంగా నిలుపుతాం

దేశంలో తలసేమియాలేని తొలి రాష్ట్రంగా నిలుపుతాం
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణను తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి హరీశ్ రావు. ఆరోగ్య శ్రీ కింద తలసేమియా బాధితులకు ట్రీట్మెంట్ అందుతుందన్నారు. త్వరలోనే తలసేమియా మీద మీటింగ్స్ పెట్టి చిన్నారులకు ప్రభుత్వం నుంచి మరింత సాయం అందేలా చూస్తామన్నారు. హైదరాబాద్ లో తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో హరీశ్ మాట్లాడారు.
తల‌సేమియా వ్యాధి బారిన ప‌డిన పిల్ల‌ల‌ను చూస్తుంటే చాలా బాధ క‌లుగుతోందని, అందుకే ఇలాంటి పిల్లలందరికీ ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యం అందిస్తున్నామ‌ని తెలిపారు. నిపుణులు, వైద్యాధికారులతో మరోసారి చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని.. దేశంలో తలసేమియాలేని తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

అంబులెన్స్ లేక... మృతదేహాన్ని మోసుకెళ్లిన వృద్ధుడు

సిజేరియన్ డెలివరీలకు ముహూర్తాలు పెట్టొద్దు

హీరోయిన్ జాక్వెలిన్‌ ఆస్తులు సీజ్‌ చేసిన ఈడీ