పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. టివోలి చౌరస్తాలో రక్షణ శాఖకు చెందిన బీ–3 బంగ్లా నంబర్ 221బీలో అక్రమంగా నిర్మించిన షెడ్లను శనివారం కూల్చివేశారు.
అక్రమ నిర్మాణాలు తొలగించాలని గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో, కంటోన్మెంట్ బోర్డు సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లు ఉమాశంకర్, ఫణికుమార్ పాల్గొన్నారు.
