పోలింగ్ స్టేషన్స్‌‌‌‌, స్ట్రాంగ్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ కు భారీ భద్రత

పోలింగ్ స్టేషన్స్‌‌‌‌, స్ట్రాంగ్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ కు భారీ భద్రత

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని పోలింగ్‌‌‌‌ స్టేషన్స్‌‌‌‌, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల ఎస్పీలు, సీపీలతో డీజీపీ అంజనీ కుమార్‌‌‌‌‌‌‌‌ సమీక్షలు నిర్వహించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. లోకల్ పోలీసులతో పాటు సెంట్రల్ ఆర్డ్మ్‌‌‌‌ పోలీస్ ఫోర్స్‌‌‌‌, ర్యాపిడ్ యాక్షన్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌లను భద్రతకు వినియోగించనున్నారు.

నోడల్‌‌‌‌ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో సంబంధిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహించనున్నాయి. పోలింగ్‌‌‌‌ సమీపిస్తుండడంతో ఓటర్లను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా ఫ్లాగ్‌‌‌‌ మార్చ్‌‌‌‌లు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్‌‌‌‌ ప్రాంతాలపై ఫోకస్.. పోలింగ్‌‌‌‌కు రెండ్రోజుల ముందు నుంచే కేంద్ర బలగాలు పోలింగ్ స్టేషన్స్‌‌‌‌ను తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌‌‌‌ రూమ్‌‌‌‌లకు కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.