మిలటరీ గుప్పిట్లో వాషింగ్టన్
జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఫుల్ సెక్యూరిటీ
అల్లర్లు, కాల్పులు జరగొచ్చంటూ నిఘా వర్గాల వార్నింగ్
వాషింగ్టన్‌లో 25 వేల నేషనల్ గార్డుల మోహరింపు
అన్ని స్టేట్స్ క్యాపిటల్ బిల్డింగుల వద్దా భారీ భద్రత
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ సిటీ మొత్తం మిలటరీ కంట్రోల్ లోకి వెళ్లింది. సిటీ అంతటా వీధి వీధినా నేషనల్ గార్డ్ బలగాలను మోహరించారు. బుధవారం బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో భద్రతా సిబ్బందిలోనే కొందరు అంతర్గతంగా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఎఫ్బీఐ గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో సెక్యూరిటీని టైట్ చేసింది. ఒక్క వాషింగ్టన్ సిటీలోకే ఏకంగా 25 వేల మంది నేషనల్ గార్డ్ బలగాలను దించింది. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే రంగంలోకి దిగేలా ప్రతి చోటా నేషనల్ గార్డులను మోహరించింది. ఈ నెల 6న యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ పై దాడి తర్వాత పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. ఆందోళనకారులు గన్స్ తో కాల్పులకు దిగొచ్చని, సెక్యూరిటీ సిబ్బందిలోనే కొందరు కాల్పులకు తెగబడొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సొంత సెక్యూరిటీ సిబ్బందిపైనే ఎఫ్బీఐ అధికారులు నిఘా పెట్టారు. నేషనల్ గార్డు కమెండోలను కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మరీ వాషింగ్టన్ లో మోహరించారు. వాషింగ్టన్ లోని డౌన్ టౌన్ ఏరియాలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ పై ఆంక్షలు పెట్టారు. సిటీలోకి ఎంటరయ్యే మెయిన్ బ్రిడ్జిలన్నింటినీ మూసేశారు. యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్, వైట్‌హౌస్‌తో పాటు మెయిన్ బిల్డింగులకు బారికేడ్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
స్టోర్లు, ల్యాండ్ మార్క్ లు బంద్
బైడెన్ ప్రమాణం సందర్భంగా వాషింగ్టన్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు తమ స్టోర్లను మూసేస్తున్నాయి. ఆదివారం పలు రాష్ట్రాల్లోని క్యాపిటల్ బిల్డింగుల వద్ద రైఫిల్స్ ను పట్టుకుని కొందరు నిరసనకారులు గుమిగూడారు. బుధవారం కొందరు కాల్పులకు కూడా తెగబడొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో లోకల్ ప్రభుత్వాలు కూడా కీలక ల్యాండ్ మార్క్ లను, జనం ఎక్కువగా తిరిగే ప్రదేశాలను బంద్ పెడుతున్నాయి. రాష్ట్రాల్లోని క్యాపిటల్ బిల్డింగుల వద్ద కూడా సెక్యూరిటీ పెంచారు.
అట్టహాసంలేకుండా వేడుకలు
అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం సందర్భంగా గతంలో అట్టహాసంగా వేడుకలు జరిగేవి. దేశవ్యాప్తంగా10 లక్షల మంది వాషింగ్టన్ కు వచ్చేవారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలు గెస్టులుగా వచ్చేసి వేడుకల్లో పాల్గొనేవారు. ఈసారి వెయ్యి మంది మాత్రమే గెస్టులు రానున్నారు. కాంగ్రెస్ సభ్యులు, వారిలో ఒక్కొక్కరి తరఫున ఒక్కో గెస్టుకు మాత్రమే పాస్ లు జారీ చేశారు. ఇక చాలా కార్యక్రమాలు వర్చువల్ గా మాత్రమే జరగనున్నాయి. గెస్టులంతా మాస్కులు పెట్టుకుని పాల్గొననున్నారు. గతంలో పదవి నుంచి దిగిపోయే ప్రెసిడెంట్లు కూడా కొత్త ప్రెసిడెంట్ల ప్రమాణానికి హాజరయ్యేవారు. కానీ బైడెన్ ప్రమాణస్వీకారానికి హాజరుకాబోనని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. ట్రంప్ తో పాటు దిగిపోనున్న వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ మాత్రం హాజరు కానున్నారు. కాంగ్రెస్ సభ్యులతో పాటు టాప్ అఫీషియల్స్, సుప్రీం జడ్జీలు మాత్రమే హాజరుకానున్నారు.
For More News..
మహారాష్ట్ర – కర్నాటక బార్డర్ ఫైట్.. ఇంచు కూడా వదలమంటున్న కర్నాటక
బార్డర్ దాటొచ్చి ఊరు కట్టిన చైనా
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి
బీజేపీ మాఫియా పార్టీ.. బండి సంజయ్ అసలు హిందువేనా?
రాష్ట్రంలో రోజుకు లక్ష మందికి టీకా
