శంభూ సరిహద్దు వద్ద రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం..

శంభూ సరిహద్దు వద్ద రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం..

న్యూఢిల్లీ: రైతులు తమ ఢిల్లీ చలో ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించుకున్న తర్వాత శంభూ సరిహద్దు వద్ద నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు భద్రతాసిబ్బంది. పప్పు ధాన్యాలు, మొక్క జొన్న, పత్తి పంటలకు ఐదేళ్ల పాటు కనీస మద్దతు ధర ప్రభుత్వ  సంస్థల ద్వారా కొనుగోలు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనను నిరసన తెలుపుతున్న రైతులు తిరస్కరించారు. తమ ఆందోళనను కొనసాగిస్తామని మంగళవారం (ఫిబ్రవరి 20) ప్రకటించిన తర్వాత ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగించేందుకు మరోసారి సిద్ధమయ్యారు. 

మరోవైపు పంజాబ్, హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద ఆందోళన చేస్తున్న రైతులు శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్రను చేస్తారని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్వాల్ బుధవారం (ఫిబ్రవరి 21) తెలిపారు. రైతుల డిమాండ్లపై బీజేపీ నేతృత్వంలో ని కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసే వ్యూహాలకు పాల్పడుతుందని దల్లేవాల్ ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనేది మా ఉద్దేశం.. అని అన్నారు దల్లేవాల్. రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. రైతులు ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకునేందుకు పంజాబ్, హర్యానా మధ్య సరిహద్దు పాయింట్ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను దల్లేవాల్ ఖండించారు.