భద్రాచలం, వెలుగు: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మంగళవారం మావోయిస్టుల డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారం మేరకు జిల్లా పరిధిలోని కల్మీటా- కటువా పదర్ అడవుల్లో డీవీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూంబింగ్ నిర్వహించినట్లు ఎస్పీ వినోద్ పాటిల్ తెలిపారు.
ఇన్సాస్ మిషన్ గన్, ఎల్ఎంజీ, రెండు ఇన్సాస్ రైఫిల్స్, 2 టిఫిన్ బాక్స్ బాంబులు, ఒక గ్రైనేడ్, 8 కిలోల పేలుడు పదార్థాలు, ఒక ఏకె-47 మ్యాగ్జైన్, 18 ఎలక్ట్రిక్ వైర్ బండిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
