భద్రాచలం, వెలుగు: ఆదివాసీలకు కొమురం భీం ఆదర్శమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. చర్ల మండలం కేశవాపురంలో మంగళవారం ఆయన కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
గిరిజనుల వీరుడు కొమురం భీమ్ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంతకుముందు ఆయనకు ఆదివాసీలు రేలా నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.
