మణుగూరు, వెలుగు: పశువులు పోట్లాడుకుంటూ ఓ వృద్ధురాలిపై పడడంతో చనిపోయింది. ఎస్సై నగేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పీవీ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు శ్రీనివాస్ తల్లి చింతల ఎల్లమ్మ(80) రెండు రోజుల కింద తన కొడుకును చూసేందుకు ఇల్లందు నుంచి మణుగూరుకు వచ్చింది.
మంగళవారం ఉదయం తిరిగి ఇల్లందు వెళ్లేందుకు బస్టాండ్ కు వెళ్తుండగా, పశువులు కొట్లాడుకుంటూ వచ్చి ఎల్లమ్మ మీద పడడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
