ఫిలిప్పీన్స్ భూకంపం.. బిల్డింగులు ఎలా కూలిపోయాయో చూడండి.. క్షణాల్లోనే అల్లకల్లోలం

ఫిలిప్పీన్స్ భూకంపం.. బిల్డింగులు ఎలా కూలిపోయాయో చూడండి.. క్షణాల్లోనే అల్లకల్లోలం

ఫిలిప్పీన్స్ లో వచ్చిన భూకంపం రెప్ప పాటులోనే అల్లకల్లోలం సృష్టించింది. పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. జనాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు పెట్టిన పరిస్థితి. జూన్ 08 ఉదయం 8.1 తీవ్రతతో వచ్చిన ఎర్త్ క్వేక్.. 12 మందిని బలితీసుకుంది. 200 మందికి పైగా గాయపడ్డారు. శకలాల కింద ఇంకా ఉన్నారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. 

8.1 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చిన భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ వస్తే తీర ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోతాయని హెచ్చరించడంతో.. అక్కడి నుంచి జనాలను ఖాళీ చేయించారు. పట్టణాల్లో జనాలు ఇండ్లను వదిలి పరుగులు పెట్టారు. 

భూకంపానికి సంబంధించిన విజువల్స్ భయాందోళన కలిగిస్తున్నాయి. చూస్తుండగానే పెద్ద పెద్ద భవంతులు కూలిపోయాయి. స్కూళ్లు, కాలేజీలలో విద్యార్థులను క్లాస్స రూముల నుంచి బయటకు తీసుకొచ్చి ఆవరణలో కూర్చోబెట్టారు. ఆ సమయంలో భూమి కదలికలు డేంజర్ గా కనిపించాయి. కూర్చున్న విద్యార్థులపై షెడ్డు పడుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. 

దక్షిణ ఐలాండ్ లో 7.8 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు మొదట జర్న్ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. దీంతో సముద్రపు అలలు ఒక మీటర్ పైకి ఎగసి పడ్డాయి. అంటే దాదాపు 3 ఫీట్ల పైనే అలలు ఎగసి పడటంతో.. తీర ప్రాంతాలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. 

మిందనావో కు దగ్గరలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ ఫర్ జియో సైన్సెస్ (GFZ)  పేర్కొంది. మొదట 7.3 నుంచి 8.2 గా పేర్కొన్న సంస్థ... తర్వాత భూకంప తీవ్రతను 7.8 కి సవరించింది. .

7.8 వీవ్రతతో వచ్చిన భూకంపంతో భారీగా కుదుపులు వచ్చినట్లు ఫిలిప్పీన్స్ మీడియా పేర్కొంది.  ఫిలిప్పీన్స్ తో పాటు, ఇండోనేషియా దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించారు. భూకంపం తర్వాత సముద్ర తీరాలలో నీరు భారీగా ఎగసిపడుతోందని.. ప్రస్తుతం కాస్త శాంతించినట్లు పేర్కొన్నారు.