విధుల్లోకి తీసుకునేలా చూడండి.. బండిని కలిసిన గాంధీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది

విధుల్లోకి తీసుకునేలా చూడండి.. బండిని కలిసిన గాంధీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని గాంధీ హాస్పిటల్ ఫోర్త్ క్లాస్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నారు. ప్రభుత్వం, అధికారులపై ఒత్తిడి తెచ్చి తమను విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ని కోరారు. గురువారం పార్టీ స్టేట్‌‌ ఆఫీసులో సంజయ్‌‌ని కలిసి వినతిపత్రం అందజేశారు.

కరోనా సమయంలో ఏ ఒక్కరూ గాంధీ హాస్పిటల్‌‌లో సేవలు అందించేందుకు సిద్ధంగా లేని సమయంలో.. తాము ముందుకు వచ్చి ఉద్యోగాల్లో చేరి ప్రాణాలకు తెగించి పని చేశామని గుర్తుచేశారు. అయినప్పటికీ తమ సేవలు అవసరం లేదని చెబుతూ గత నెలాఖరులో ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.