విత్తనాల కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

విత్తనాల కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

ఏపీ : వర్షాలు పడ్డాయి. అయినా మార్కెట్లో విత్తనాలు దొరకడంలేదని ఏపీలో రోడ్డెక్కారు అన్నదాతలు. అనంతపురం జిల్లాలోని కుందూర్పిలో సబ్సిడి వేరుశనగ విత్తనాల కోసం సోమవారం రైతులు రోడ్డుపై ధర్నా చేశారు. వారం రోజులుగా విత్తనాలు అందడంలేదంటూ బైఠాయించారు. వేరుశనగ విత్తానాలను రాత్రికి రాత్రే కర్ణాటకకు తరలిస్తున్నారని అన్నదాతలు ఆరోపించారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, తక్షణం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పంట సాగుకు పొలం దుక్కు దున్నామని తేమ ఆరకముందే విత్తుకునేందుకు విత్తనాలు పంపిణీ చేయాలని రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొన్ని గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.