లొట్టపీసు కేసు అయితే వణుకు ఎందుకు? : మంత్రి సీతక్క

లొట్టపీసు కేసు అయితే వణుకు ఎందుకు? : మంత్రి సీతక్క
  •     కేటీఆర్‌‌పై మంత్రి సీతక్క ఫైర్

హైదరాబాద్, వెలుగు:  ఫార్ములా ఈ రేస్​ కేసు లొట్టపీసు కేసు అయితే వణుకు ఎందుకని కేటీఆర్​పై మంత్రి సీతక్క ఫైర్​ అయ్యారు. మంగళవారం  ఆమె అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్​ కేసు విషయంలో కేటీఆర్ ప్రదర్శిస్తున్నది మేకపోతు గాంభీర్యమేనని, లోపల భయం పెట్టుకుని బయటకు మాత్రం ధైర్యవంతుడిలా నటిస్తున్నారని విమర్శించారు. 

కేటీఆర్ చెబుతున్నట్టు అది కేవలం లొట్టపీసు కేసు అయితే ఆయన అంతలా ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. తప్పు చేయనప్పుడు చట్టానికి భయపడాల్సిన అవసరం ఏముంది? అని పేర్కొన్నారు. నా కోసం అధికారులను వేధించవద్దంటూ కేటీఆర్ ప్రకటనలు చేయడం పెద్ద డ్రామా అని మండిపడ్డారు.  అధికారులపై ఆయన చూపిస్తున్నది కేవలం కపట ప్రేమ మాత్రమేనన్నారు. అధికారులపై నిజంగా అంత ప్రేమ ఉంటే.. మరి రెడ్ బుక్ లో  పేర్లు ఎలా రాస్తున్నామని, రాబోయే రోజుల్లో అంతు చూస్తామని బెదిరించడం ఎందుకు? అని ప్రశ్నించారు.