వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వీఆర్ఏల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. వీఆర్ఏల డిమాండ్లు, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గద్దె ఎక్కిన తర్వాత ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ ఎత్తేసిన ఘనత కేసీఆర్ సొంతమని సీతక్క విమర్శించారు. వీఆర్ఏలుగా కొనసాగుతున్న వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారన్న ఆమె.. వారికి ప్రమోషన్లు ఇవ్వకుండా తెలంగాణ సర్కారు వెట్టి చాకిరీ చేయించుకుంటోందని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని.. వీఆర్ఏల అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. 

For more news..

తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు?

23న భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్