అమరవీరుల త్యాగాలు మరువలేనివి : మంత్రి ధనసరి సీతక్క

అమరవీరుల త్యాగాలు మరువలేనివి : మంత్రి ధనసరి సీతక్క

ములుగు, వెలుగు : తెలంగాణ ఉద్యమకారుల పోరాట స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అమరవీరుల త్యాగాలు మరువలేనివని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. తెలంగాణ అవతరణ వేడుకల్లో భాగంగా మొదట క్యాంపు ఆఫీస్​లో జాతీయ జెండా ఆవిష్కరించి, అనంతరం కలెక్టరేట్​లో మంత్రి, ఎంపీ బలరాం నాయక్ తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం గోవిందరావుపేట మండలం రంగాపూర్ లో 27మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. 

రూ.8 కోట్లతో రాఘవపట్నం రోడ్డు, జంపన్న వాగు బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 1,400 క్వింటాళ్ల జీలుగ, 50 క్వింటాళ్ల జనుము, 50 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలను పంపిణీకి సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ములుగులో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తదితరులు పాల్గొన్నారు.