అంగన్ వాడీల బలోపేతంపై ఫోకస్ పెట్టండి: సీతక్క ఆదేశం

అంగన్ వాడీల బలోపేతంపై ఫోకస్ పెట్టండి:  సీతక్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ కేంద్రా ల బలోపేతం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రైమరీ స్కూళ్ల దగ్గరే అంగన్ వాడీలు ఉండేలా చూడాలనిసూచించారు.  మంగళవారం ఆమె సెక్రటేరియెట్ లో ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ల తో  రివ్యూ మీటింగ్ నిర్వహించారు.  రాష్ట్రంలో స్ర్తీ ,శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా మంత్రికి అధికారులు తెలియ జేశారు.

 అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేని పిల్లల(ఆర్ఫాన్లు)కు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో  రెండు శాతం కోటా కేటాయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అనాథ పిల్లలను దత్తత తీసుకునే నిబంధనలను సులభతరం చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు మండల కేంద్రాల్లోని డైరీల ద్వారానే అంగన్ న్వాడీ లకు పాలు తేవాలని చెప్పారు. ఇందుకోసం ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ఆయన  తెలిపారు.