మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క

మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేశారు.  ఆయనతో  గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.  సీతక్క మూడుసార్లు ఎమ్మెల్యేగా ములుగు శాసనసభ నియోజకవర్గం  నుంచి ఎన్నికయ్యారు.  

2004లో తొలిసారి టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలైంది. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టింది.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థినిగా బరిలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయింది.

 ఆ తరువాత  టీడీపీకి గుడ్‌బై చెప్పిఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ పై 22,671 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2023 ఎన్నికల్లో గెలిచిన ఆమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.