15న మరో ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌

15న మరో ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌
  •     సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మూడు పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటు
  •     ఇప్పటికే ఓ పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌ పూర్తి
  •     15న రెండో, 20న మూడో పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ ట్రయల్‌‌‌‌‌‌‌‌రన్‌‌‌‌‌‌‌‌కు ఏర్పాట్లు
  •     వైరా లింక్​ కెనాల్ పనుల స్పీడప్‌‌‌‌‌‌‌‌పై మంత్రి తుమ్మల ఫోకస్​

ఖమ్మం, వెలుగు: సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మూడు పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌లను నిర్మించారు. ఇందులో బీజీ కొత్తూరులోని మొదటి పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌ను గత నెల 27నే పూర్తి చేశారు. ఇక వీకే రామవరం దగ్గరున్న రెండో పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ ట్రయల్‌‌‌‌‌‌‌‌రన్‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 15న, కమలాపురం దగ్గరున్న మూడో పంప్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌ ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌ను 20న నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు లింక్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ ద్వారా వైరా రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు నీళ్లు అందించే పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.  

పెండింగ్‌‌‌‌‌‌‌‌ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి సాగునీటి సరఫరాకు సిద్ధం చేయాలని ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఏన్కూరు నుంచి వైరా రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు నీటిని తరలించే లింక్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ 8.6 కిలోమీటర్ల పొడవు ఉండగా, 16 చోట్ల సిమెంట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణాలు చేయాల్సి ఉంది. వీటిలో ఇప్పటికే ఏడు పూర్తి కాగా మిగిలిన వాటిని కూడా నెలాఖరులోగా కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేసేలా పనులు జరుగుతున్నాయి.

పనుల స్పీడప్‌‌‌‌‌‌‌‌ కోసం మంత్రి తుమ్మల చొరవ

వైరా లింక్ కెనాల్ ద్వారా ఆగస్టు 15నాటికి లక్షన్నర ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పనుల స్పీడప్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేశారు. వైరా లింక్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి ఏపీలోని కేజీ బేసిన్‌‌‌‌‌‌‌‌ నుంచి గుజరాత్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే గ్యాస్‌‌‌‌‌‌‌‌ పైప్‌‌‌‌‌‌‌‌ పనులు అడ్డంకిగా మారాయి. లింక్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌కు 5.3 కిలోమీటర్ల దగ్గర గుజరాత్ స్టేట్‌‌‌‌‌‌‌‌ పెట్రోనెట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ నేచురల్‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌ పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి వస్తోంది. దీనికి సంబంధించిన అనుమతుల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు. 

పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ క్రాసింగ్‌‌‌‌‌‌‌‌ వివరాలను మంత్రి తుమ్మల బుధవారం సీఎస్‌‌‌‌‌‌‌‌ శాంతి కుమారికి వివరించగా, ఆమె ఫోన్‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీతో మాట్లాడి క్రాసింగ్‌‌‌‌‌‌‌‌ అనుమతి కోసం తాడేపల్లిగూడెంలోని పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ జీఎంకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఏపీ సీఎస్‌‌‌‌‌‌‌‌కు మంత్రి తుమ్మల ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి సమస్యను వివరించారు. అలాగే పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌లోని లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లకు ఉపయోగించే మోటార్ల ఫిట్టింగ్‌‌‌‌‌‌‌‌కు టెక్నికల్‌‌‌‌‌‌‌‌ సమస్యలు తలెత్తగా చైనా నుంచి ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ను తీసుకురావాల్సి ఉందని ఆఫీసర్లు తుమ్మల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వారి వీసా సమస్యలపై ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ రాహుల్‌‌‌‌‌‌‌‌ బొజ్జాకు తుమ్మల వివరించారు. తర్వాత మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులతోనూ మాట్లాడారు.