ఫిట్ నెస్ లేని  17 స్కూల్ బస్సులు సీజ్

ఫిట్ నెస్ లేని  17 స్కూల్ బస్సులు సీజ్

శంషాబాద్, వెలుగు: ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సులను రాజేంద్రనగర్, శంషాబాద్​లో ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. బుధవారం స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా మోటార్​ వెహికల్ ఇన్ స్పెక్టర్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రూల్స్ పాటించని స్కూల్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 12 స్కూల్ బస్సులను, శంషాబాద్ పరిధిలో ఐదింటిని అధికారులు సీజ్ చేశారు.